Share News

ప్రతి నియోజకవర్గానికి హైవేలు కలిసేలా ప్రణాళిక

ABN , Publish Date - May 04 , 2026 | 04:33 AM

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి నియోజకవర్గానికి హైవేలు కలిసేలా త్వరలో ప్రణాళిక సిద్ధం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తెలిపారు.

ప్రతి నియోజకవర్గానికి హైవేలు కలిసేలా ప్రణాళిక

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌

ద్వారకాతిరుమల, మే 3 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి నియోజకవర్గానికి హైవేలు కలిసేలా త్వరలో ప్రణాళిక సిద్ధం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీహెచ్‌ పోతేపల్లిలో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో డబుల్‌ఇంజన్‌ సర్కార్‌ నడుస్తోంది.. మన ప్రాంతానికి రెండు నేషనల్‌ హైవేలు తెచ్చాం. ఏడాదిన్నర కాలంలో ఏపీకి 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మోదీ, బాబు నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై పెట్టుబడులు పెడుతున్నారు’ అని పేర్కొన్నారు.

Updated Date - May 04 , 2026 | 04:34 AM