కాంగ్రెస్‌ను ఎండగడతాం: నాగోతు రమేశ్
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:30 AM
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ తదితర పక్షాల తీరును నిరసిస్తూ 24న విజయవాడలో కూటమి పార్టీలు పెద్ద ఎత్తున నిరసన చేపడతాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేశ్ నాయడు తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ తదితర పక్షాల తీరును నిరసిస్తూ 24న విజయవాడలో కూటమి పార్టీలు పెద్ద ఎత్తున నిరసన చేపడతాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేశ్ నాయడు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విజయవాడలో జరిగే నిరసనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొంటారని వెల్లడించారు. రాజమహేంద్రవరంలో ఎంపీ పురందేశ్వరి, తిరుపతిలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కూటమి పార్టీలతో కలసి నిరసనల్లో పాల్గొంటారని రమేశ్ నాయుడు తెలిపారు.