Share News

ఏపీలో బీజేపీ బలపడుతోంది

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:43 AM

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సంస్థాగతంగా బలోపేతమవుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ తెలిపారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు...

ఏపీలో బీజేపీ బలపడుతోంది

  • జాతీయ అధ్యక్షుడు నబీన్‌తో మాధవ్‌ భేటీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సంస్థాగతంగా బలోపేతమవుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ తెలిపారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ను కలిశారు. పార్టీ బలోపేతానికి 15 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి.. గ్రామ స్థాయి నుంచి బూత్‌ స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను విస్తరించినట్లు వివరించారు. కేంద్ర పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, సిద్ధాంతాలపై విస్తృత ప్రచారం, కొత్త సభ్యుల నమోదు గురించి తెలియజేశారు. మాజీ ప్రధాని వాజపేయి శతజయంతి సందర్భంగా ఏపీలో నిర్వహించిన బస్సు యాత్రకు సంబంధించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా నబీన్‌ ఆవిష్కరించారు. సమావేశంలో బీజేపీ జాతీయ నేతలు బీఎల్‌ సంతోష్‌, శివప్రకాశ్‌, రాష్ట్ర నేతలు మధుకర్‌, రమేశ్‌నాయుడు, సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, రొంగలి గోపిశ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 03:43 AM