Share News

పండుగలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి: బీజేపీ

ABN , Publish Date - Mar 18 , 2026 | 06:35 AM

ఉగాది, శ్రీరామనవమి పండుగలకు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పండుగలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి: బీజేపీ

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ఉగాది, శ్రీరామనవమి పండుగలకు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పంచాంగ శ్రవణం నిర్వహణతో పాటు ఆలయాల్లో చేసుకునే పూజల్లో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా వసతులు కల్పించాలని కోరారు. ప్రతి ఊరిలోనూ రాములోరి ఉత్సవాలు జరపాలని, ఆదాయం లేని ఆలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించి సంతోషంగా ప్రజలు సంబరాలు చేసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Mar 18 , 2026 | 06:36 AM