Share News

మోదీపై ప్రజలకు విశ్వాసం పెరిగింది: బీజేపీ

ABN , Publish Date - May 05 , 2026 | 04:33 AM

దేశం కోసం నిరంతరం శ్రమిస్తోన్న ప్రధాని మోదీపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్య కుమార్‌, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అభిప్రాయపడ్డారు.

మోదీపై ప్రజలకు విశ్వాసం పెరిగింది: బీజేపీ

అమరావతి, శ్రీకాళహస్తి, మే 4(ఆంధ్రజ్యోతి): దేశం కోసం నిరంతరం శ్రమిస్తోన్న ప్రధాని మోదీపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్య కుమార్‌, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అభిప్రాయపడ్డారు. అసోం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలతో విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సోమవారం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ‘మోదీ పాలనలో దేశ భద్రతపై ఉన్న నమ్మకమే అసోమ్‌, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయానికి కారణమైంది. అసోమ్‌, పుదుచ్చేరి ప్రజలు మరోమారు బీజేపీని గెలిపించడం అక్కడి పాలనకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.


పశ్చిమ బెంగాల్‌లో గెలుపు దేశాభివృద్ధికి మలుపు: మాధవ్‌

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుపొందడం దేశాభివృద్ధికి మరింత దోహదపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం బీజేపీ విజయోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో ఆ రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమవుతుందని మాధవ్‌ పేర్కొన్నారు.

Updated Date - May 05 , 2026 | 04:35 AM