Share News

బీజేపీనే జగన్‌ను కాపాడుతోంది

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:48 AM

జగన్‌ను కాపాడుతున్నది బీజేపీనే అని సీపీఐ జాతీయ నేత కే.నారాయణ అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో మాట్లాడారు

బీజేపీనే జగన్‌ను కాపాడుతోంది

  • సింఘాల్‌ను బదిలీ చేయడం కాదు... శిక్షించాలి: నారాయణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): జగన్‌ను కాపాడుతున్నది బీజేపీనే అని సీపీఐ జాతీయ నేత కే.నారాయణ అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో మాట్లాడారు. ‘టీటీడీ మాజీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను బదిలీ చేయడం కాదు.. శిక్షించాలి. జగన్‌ తప్పులు చేశారనే చంద్రబాబును ప్రజ లు గెలిపించారు. కానీ, అటువంటి తప్పులే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నా రు. అంబటి రాంబాబు నోరు చిన్నదేమీ కాదు. అలాగని ఇంటిపై దాడి చేయడం సరికాది. టీటీడీ వ్యవహారంలో సిట్‌ నివేదికపై రెండు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. అలాగే, తెలంగాణలో తిట్ల పురాణం కొనసాగుతోంది. కాంగ్రెస్‌ లిబరల్‌గా లేదు. అందుకే మున్సిపల్‌ ఎన్నికల్లో సీపీఐ పోటీ చేస్తోందని తెలిపారు.’ అని నారాయణ అన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 04:49 AM