బీజేపీపై నమ్మకంతోనే పట్టం కట్టారు: మాధవ్
ABN , Publish Date - May 06 , 2026 | 06:25 AM
బీజేపీపై ఉన్న నమ్మకంతో 3 రాష్ట్రాల్లో ప్రజలు ఈ ఎన్నికల్లో పట్టం కట్టారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. మంగళవారం విజయవాడలో...
విద్యాధరపురం, మే 5(ఆంధ్రజ్యోతి): బీజేపీపై ఉన్న నమ్మకంతో 3 రాష్ట్రాల్లో ప్రజలు ఈ ఎన్నికల్లో పట్టం కట్టారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. మంగళవారం విజయవాడలో విజయోత్సవాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలావుంటే, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య బీజేపీ కార్యకర్త వారధిలా పని చేయాలని మాధవ్ దిశానిర్దేశం చేశారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యశాలలో మాట్లాడుతూ.. ‘ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు జనతా వారధి చేపట్టాం.. అందులో ఎంతమేరకు ఫలితాలు సాధిస్తే అంతగా పార్టీ బలోపేతమవుతుంది.’ అని తెలిపారు.