Share News

మావిగన్‌... సలహాదారుల పనే: విష్ణుకుమార్‌రాజు

ABN , Publish Date - Apr 03 , 2026 | 06:00 AM

రాష్ట్ర రాజధానిగా అమరావతికి బదులు ‘మావిగన్‌’ను ఎంపిక చేయాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు తప్పుబట్టారు.

మావిగన్‌... సలహాదారుల పనే: విష్ణుకుమార్‌రాజు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిగా అమరావతికి బదులు ‘మావిగన్‌’ను ఎంపిక చేయాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు తప్పుబట్టారు. ‘మావిగన్‌ ఆలోచన జగన్‌కు వచ్చింది కాదు. గత ప్రభుత్వంలో మద్యం సిండికేట్‌ ద్వారా రూ.వందల కోట్లు కొట్టేసిన వాటాదారులే ఈ సలహా ఇచ్చి ఉంటారు. ఈ పేరు సూచించి జగన్‌ తన స్థాయిని దిగజార్చుకున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన తుపాకీ రూపంలో ఉన్న ఆర్కాట్‌ ఓడ్కా సీసాను ప్రదర్శించారు.

Updated Date - Apr 03 , 2026 | 06:00 AM