బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలి: మాధవ్
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:57 AM
బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం... ఏప్రిల్ 6, అంబేడ్కర్ జయంతి... ఏప్రిల్ 14ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పార్టీ...
అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం... ఏప్రిల్ 6, అంబేడ్కర్ జయంతి... ఏప్రిల్ 14ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన చేశారు. ‘ఏప్రిల్ 5 నుంచి 7 వరకూ ప్రతి బీజేపీ కార్యకర్త ఇంటిపై పార్టీ జెండాను ఆవిష్కరించి, సీనియర్ కార్యకర్తల్ని సత్కరించాలి. గావ్ చలో అభియాన్ పేరుతో ప్రజల్లోకి వెళ్లి పార్టీ విధివిధానాలు వివరిస్తూ దేశ సేవలో బీజేపీ విజయాలను ప్రచారం చేయాలి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలి. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన జీవిత విశేషాలతో పాటు సామాజిక న్యాయంపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలి’ అని మాధవ్ సూచించారు.