ప్రజలను తప్పుదోవ పట్టించడమే జగన్ ఎత్తుగడ
ABN , Publish Date - Jul 03 , 2026 | 05:18 AM
అమరావతిని ఐదేళ్ల పాటు నిర్వీర్యం చేసి, మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అనిశ్చితిలోకి నెట్టిన జగన్‌కు ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడే నైతిక..
బలవంతపు మత మార్పిళ్లను అడ్డుకుని తీరుతాం: మాధవ్, వీర్రాజు
తిరుపతి(నేరవిభాగం), జూలై 2(ఆంధ్రజ్యోతి): అమరావతిని ఐదేళ్ల పాటు నిర్వీర్యం చేసి, మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అనిశ్చితిలోకి నెట్టిన జగన్‌కు ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో ముందుగా మాధవ్ మాట్లాడుతూ... ‘రాష్ట్ర ప్రజలను గందరగోళంలో పడవేసే రాజకీయ అజెండాతో కొత్త కొత్త పేర్లతో రాజధాని అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. హిందూ దేవతలను అవమానించేలా మాట్లాడితే ఎంతమాత్రం సహించేది లేదు. బలవంతపు మత మార్పిళ్లను బీజేపీ అడ్డుకుని తీరుతుంది’ అని అన్నారు. వీర్రాజు మాట్లాడుతూ... జగన్ మావిగన్‌ను మాయా గన్‌గా అభివర్ణించారు.