Share News

మోదీపై పేర్ని వ్యాఖ్యలు... జగన్‌ క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - May 13 , 2026 | 05:16 AM

దేశ ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు...

మోదీపై పేర్ని వ్యాఖ్యలు... జగన్‌ క్షమాపణ చెప్పాలి

  • బీజేపీ రాష్ట్ర నేతలు సురేశ్‌, వల్లూరు జేపీ, యామిని డిమాండ్‌

అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): దేశ ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజల అభిమానం చూరగొన్న మోదీపై రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన వైసీపీ నేతలు మాట్లాడటం నీచమని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ ఎస్‌సీ మోర్చా అధ్యక్షుడు పనతల సురేశ్‌, ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్‌, అధికార ప్రతినిధి యామినీ శర్మ వేర్వేరు ప్రకటనల్లో పేర్ని నానిపై మండిపడ్డారు. మోదీని విమర్శించే స్థాయి ఆయనకు లేదని, దమ్ముంటే జగన్‌ విమర్శించాలని సవాల్‌ విసిరారు.

Updated Date - May 13 , 2026 | 05:16 AM