Share News

ఆంధ్రకు అండగా కేంద్రం

ABN , Publish Date - Mar 06 , 2026 | 05:15 AM

‘రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటోంది.

ఆంధ్రకు అండగా కేంద్రం

  • జగన్‌ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నాశనం: బీజేపీ నేత లక్ష్మణ్‌

అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటోంది. జగన్‌ పాలనలో నాశనమైన ఆంధ్రప్రదేశ్‌ను గాడిన పెట్టేందుకు డబులింజన్‌ సర్కార్‌ కృషి చేస్తోంది’ అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రమేశ్‌ నాయుడు, గోపీ శ్రీనివాస్‌, యామినీ శర్మతో కలసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘హిందూ ఆలయాలపై దాడులు, మతమార్పిళ్లు, అవినీతి, అరాచక వైసీపీకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు’ అని అన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 05:16 AM