Share News

దళితుల హక్కుల రక్షణే బీజేపీ లక్ష్యం

ABN , Publish Date - Jul 16 , 2026 | 05:16 AM

దళిత హక్కుల పరిరక్షణే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్‌ మాధవ్‌ స్పష్టం చేశారు. దళితులు ఇతర మతాల్లోకి వెళితే రిజర్వేషన్లకు అనర్హులన్నారు.

దళితుల హక్కుల రక్షణే బీజేపీ లక్ష్యం

  • రాజ్యాంగ విరుద్ధ డిమాండ్లను అడ్డుకుంటాం: మాధవ్‌

విజయవాడ, జూలై 15(ఆంధ్రజ్యోతి): దళిత హక్కుల పరిరక్షణే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్‌ మాధవ్‌ స్పష్టం చేశారు. దళితులు ఇతర మతాల్లోకి వెళితే రిజర్వేషన్లకు అనర్హులన్నారు. బీజేపీ కులవిద్వేష నిర్మూలన వేదిక ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో దళితుల హక్కులపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. మాధవ్‌ మాట్లాడుతూ దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడమే బీజేపీ లక్ష్యమన్నారు. రాజ్యాంగం పరిధిలో లేని అంశాలను తెరపైకి తీసుకువచ్చి బలహీన వర్గాల హక్కులకు భంగం కలిగించే ప్రయత్నాలను బీజేపీ వ్యతిరేకిస్తుందని తేల్చిచెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా దళిత హక్కులను దెబ్బతీసే ప్రయత్నాలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని, గతం లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మతపరమైన రిజర్వేషన్లు తీసుకువస్తే బీజేపీ మాత్ర మే అడ్డుకుందని చెప్పారు. సామాజికవేత్త రాధామనోహర్‌ దాస్‌ మాట్లాడుతూ మత స్వేచ్ఛ ప్రతి పౌరుడి హక్కేనన్నారు. అయితే, రాజ్యా ంగం కల్పించిన రిజర్వేషన్ల అమలులో రాజ్యాంగ నిబంధనలను గౌరవించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సమాజం లో విభేదాలు సృష్టించే రాజకీయాలను ప్రజ లు తిరస్కరించాలని కోరారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేశ్‌ మాట్లాడుతూ దళితుల రాజ్యాంగబద్ధ హక్కు ల పరిరక్షణ కోసం సమాజం ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. దళిత హక్కు ల సంఘం నేత మోహన్‌ మాట్లాడు తూ దళితుల అభ్యున్నతికి రాజ్యాంగమే మార్గదర్శకమన్నారు. అంబేడ్కర్‌ ఆలోచనలను సమాజంలో విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె దేవానంద్‌, మాజీ ఎంపీ వర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. దళిత హక్కుల పరిరక్షణ, రాజ్యాంగబద్ధ రిజర్వేషన్ల అమలు, సామాజిక సమానత్వం, అంబేడ్కర్‌ ఆశయాల పరిరక్షణకు సంబంధించి పలు తీర్మానాలను ఆమోదించారు.

Updated Date - Jul 16 , 2026 | 05:17 AM