Share News

విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలి

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:03 AM

‘రాష్ట్రంలో విద్రోహ శక్తులు కుట్రలు చేస్తున్నాయి. దళితవాదం పేరుతో హిందూ దేవుళ్లను దూషిస్తున్నాయి. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు మత చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తున్నాయి.

విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలి

  • దళితవాదం పేరుతో హిందూ దేవుళ్లను దూషిస్తున్నారు: మాధవ్‌

అమరావతి,విజయవాడ, జూలై 8(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో విద్రోహ శక్తులు కుట్రలు చేస్తున్నాయి. దళితవాదం పేరుతో హిందూ దేవుళ్లను దూషిస్తున్నాయి. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు మత చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటువంటి శక్తులను సమాజం తిప్పికొట్టాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు. విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టుల వర్క్‌షాపులో మాధవ్‌ మాట్లాడారు. ప్రభుత్వాలను విమర్శించొచ్చు కానీ... విద్వేష అజెండాతో ఉగ్రవాదాన్ని భుజాన వేసుకుంటాం, ప్రజల్లో మత చిచ్చు రేపుతాం అంటే సహించేది లేదన్నారు. ప్రతి ఒక్కరూ తమ మతాన్ని ఆరాధించుకోవచ్చని, ఇతర మతాల దేవుళ్లను అగౌరవపరిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని చెప్పారు. రాష్ట్రంలో దళితులను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నా లు జరుగుతున్నాయని మాధవ్‌ విమర్శించారు. దళితుల అభ్యు న్నతికి చిత్తశుద్ధితో పనిచే యాల్సిన అవసర ముందన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంప్రదాయ డప్పు కళాకారులు, వారి కళను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు. సామాజిక సామరస్యానికి భంగం కలిగించేలా, హిందూ ధర్మాన్ని అవమానించేలా, విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాబోయే రోజుల్లో దళిత సాధికారత, సామాజిక న్యాయం, అంబేడ్కర్‌ ఆశయాల సాధన కోసం మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ మోర్చా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు.


  • హిందుత్వ మూలాలను దెబ్బతీసే కుట్ర

  • సత్యకుమార్‌

రాష్ట్రంలో అభివృద్ధికి అనుకూల వాతావరణం ఏర్పడిన ప్రతిసారి.. ప్రతిపక్షాలు కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల నుంచి కుట్రపూరిత వీడియోలు పంపిస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్య లు తీసుకోవాలన్నారు. హిందుత్వ మూలాలను దెబ్బతీసే కుట్రలకు జగన్‌ పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధే ప్రధాన అజెండాగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మంత్రి చెప్పారు.

Updated Date - Jul 09 , 2026 | 04:04 AM