హిందూ వ్యతిరేకిగా వైసీపీ: మాధవ్
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:53 AM
దేశంలోని కొన్ని విచ్ఛిన్నకర శక్తులు సనాతన ధర్మం, దేశ అస్తిత్వంపై దాడులకు తెగబడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు.
విజయవాడ అర్బన్, జూలై 11(ఆంధ్రజ్యోతి): దేశంలోని కొన్ని విచ్ఛిన్నకర శక్తులు సనాతన ధర్మం, దేశ అస్తిత్వంపై దాడులకు తెగబడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. విజయవాడలో ఏపీ బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శనివారం ‘జనతా వారధి-ఉచిత న్యాయ సహాయం’ వర్క్‌షాప్ జరిగింది. ఈసందర్భంగా 146 మంది న్యాయవాదులు బీజేపీలో చేరారు. మాధవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కు లాల మధ్య చిచ్చు రగిల్చేందుకు పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. ఉన్మాద కార్యకలాపాలు చేస్తున్న రావణ్‌ను అరెస్ట్ చేస్తే, అతనికి సీపీఐ, వైసీపీ నాయకులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. కొందరు మేధావు ల ముసుగులో యూట్యూబ్ చానళ్లు వేదికగా విద్వేషాలు పెంచుతున్నారని చెప్పారు. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సైతం ఆ అరెస్టును తప్పుబట్టడం శోచనీయమన్నారు. ప్రతి శుక్రవారం అందుబాటులో ఉండేలా అన్ని బీజేపీ జిల్లా కార్యాలయాల్లో ‘ఉచిత న్యాయ సలహా కేంద్రాలు’ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.