Share News

2027 నుంచి అడ్మిషన్లు

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:17 AM

అమరావతిలో ఏర్పాటవుతున్న తమ క్యాంప్‌సలో క్వాంటమ్‌, ఏఐ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు బిట్స్‌ పిలాని ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు..

2027 నుంచి అడ్మిషన్లు

సీఎం చంద్రబాబుకు తెలిపిన బిట్స్‌ పిలాని ప్రతినిధులు

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): అమరావతిలో ఏర్పాటవుతున్న తమ క్యాంప్‌సలో క్వాంటమ్‌, ఏఐ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు బిట్స్‌ పిలాని ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. గురువారం సచివాలయంలో వారు సీఎంను కలిసి, తమ క్యాంపస్‌ నిర్మాణ పురోగతిని వివరించారు. క్వాంటమ్‌ టెక్నాలజీ రంగంలో స్టార్ట్‌పలను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం వారికి సూచించారు. ఐకానిక్‌, ఏఐ క్యాంప్‌సగా అమరావతి బిట్స్‌ పిలాని నిర్మిస్తున్నామని వారు తెలిపారు. 2027 నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తామన్నారు. అమరావతి క్యాంపస్‌ సహా సంస్థ విస్తరణకు రూ.250 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని తెలిపారు. మూడు దశల్లో క్యాంపస్‌ నిర్మిస్తామని, 10వేల మంది విద్యార్థులు చదువుకునే అవకాశం అమరావతి క్యాంప్‌సలో ఉంటుందని వివరించారు.

Updated Date - Apr 24 , 2026 | 05:17 AM