Share News

‘హాల్‌మార్క్‌’ లేని రూ.3 కోట్ల ఆభరణాలు స్వాధీనం

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:19 AM

విజయవాడ గవర్నర్‌పేటలోని రాహుల్‌ జ్యూయలర్స్‌లో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు.

‘హాల్‌మార్క్‌’ లేని రూ.3 కోట్ల ఆభరణాలు స్వాధీనం

  • విజయవాడ బంగారం దుకాణంలో బీఐఎస్‌ అధికారుల తనిఖీలు

విజయవాడ అర్బన్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): విజయవాడ గవర్నర్‌పేటలోని రాహుల్‌ జ్యూయలర్స్‌లో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. హాల్‌మార్క్‌ లేని సుమారు రూ.3 కోట్లకు పైగా విలువ చేసే 2.192 కిలో గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దుకాణం యజమాని మహావీర్‌ జైన్‌పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా బీఐఎస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ టి.అర్జున్‌ మాట్లాడుతూ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వ్యాపారులపై అయిదు రెట్ల వరకు జరిమానా, ఒక ఏడాది జైలు శిక్ష ఉంటాయని తెలిపారు.

Updated Date - Jan 24 , 2026 | 04:19 AM