Share News

జీవవైవిధ్యం లేకుంటే.. మానవ మనుగడే లేదు

ABN , Publish Date - May 23 , 2026 | 05:59 AM

జీవ వైవిధ్యం లేకుంటే మానవ మనుగడే లేదని ఏపీ బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్‌ నీలాయపాలెం విజయ్‌కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య వేడుకలు గుంటూరు సమీపంలోని ...

జీవవైవిధ్యం లేకుంటే.. మానవ మనుగడే లేదు

  • ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ నీలాయపాలెం

  • 10 మందికి బయో డైవర్సిటీ కన్జర్వర్‌ అవార్డులు

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): జీవ వైవిధ్యం లేకుంటే మానవ మనుగడే లేదని ఏపీ బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్‌ నీలాయపాలెం విజయ్‌కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య వేడుకలు గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగాయి. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ‘యాక్ట్‌ లోకల్లీ ఫర్‌ ఏ గ్లోబల్‌ ఇంప్యాక్ట్‌’ నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన 10 మందికి రాష్ట్రస్థాయిలో ‘బయో డైవర్సిటీ కన్జర్వర్‌’ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ గ్లోబల్‌ వార్మింగ్‌, ఓజోన్‌ క్షీణత వంటి అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం మన గ్రామాలు, ఇళ్ల నుంచే ప్రారంభం కావాలన్నారు. బోర్డు సభ్య కార్యదర్శి పీ రామకృష్ణ మాట్లాడుతూ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కమిటీలు ఏర్పాటు చేసి, స్థానికుల సహకారంతో బయోడైవర్సిటీ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, ఏపీఎ్‌ఫడీసీ ఎండీ నందిని సలారియా, మెడిసినల్‌ ప్లాంట్‌ బోర్డు సీఈవో చంద్రశేఖర్‌, వర్సిటీ రిజిస్ర్టార్‌ సింహాచలం మాట్లాడారు.

Updated Date - May 23 , 2026 | 05:59 AM