Share News

నేటి నుంచి బైబిల్‌ మిషన్‌ మహోత్సవాలు

ABN , Publish Date - Jan 25 , 2026 | 05:22 AM

బైబిల్‌ మిషన్‌ 88వ మహోత్సవాలకు గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట 100 ఎకరాల సువిశాల ప్రాంగణం సిద్ధమైంది.

నేటి నుంచి బైబిల్‌ మిషన్‌ మహోత్సవాలు

  • గుంటూరు సమీపంలో ప్రాంగణం సిద్ధం

  • సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న క్రైస్తవ భక్తులు

పెదకాకాని, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): బైబిల్‌ మిషన్‌ 88వ మహోత్సవాలకు గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట 100 ఎకరాల సువిశాల ప్రాంగణం సిద్ధమైంది. ఆదివారం నుంచి మూడు రోజులు జరిగే మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు బైబిల్‌ మిషన్‌ అధ్యక్షుడు, మహోత్సవాల కన్వీనర్‌ జె.శామ్యూల్‌ కిరణ్‌ శనివారం తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఉచిత బస, భోజన, నీటి వసతి ఏర్పాటు చేశామన్నారు. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పోలీసులు, ప్రైవేటు సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. ఆర్టీసీ, రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక రవాణా సదుపాయంతో మహోత్సవాల ప్రాంగణానికి శనివారం రాత్రికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భక్తులను దృష్టిలో పెట్టుకొని శనివారం ప్రత్యేక ప్రార్థన సమావేశం జరిగింది.

Updated Date - Jan 25 , 2026 | 05:22 AM