Share News

భూమన వివాదాస్పద ఫ్లెక్సీ

ABN , Publish Date - Jan 31 , 2026 | 04:59 AM

సిట్‌ నివేదిక తమకు అనుకూలంగా వచ్చిందంటూ వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్న క్రమంలో టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి శుక్రవారం ఉదయం తన స్వగృహంలో హోమం నిర్వహించారు.

భూమన వివాదాస్పద ఫ్లెక్సీ

  • సీఎం, డిప్యూటీ సీఎంలను రాక్షసులుగా చిత్రీకరణ

  • టీడీపీ శ్రేణుల ఆందోళన

  • కరుణాకర్‌రెడ్డి సహా మొత్తం ఐదుగురిపై కేసు నమోదు

తిరుపతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): సిట్‌ నివేదిక తమకు అనుకూలంగా వచ్చిందంటూ వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్న క్రమంలో టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి శుక్రవారం ఉదయం తన స్వగృహంలో హోమం నిర్వహించారు. శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమంలో భూమన దంపతులు పాల్గొన్నారు. సుమారు రెండుగంటలపాటు హోమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నివాసం వద్ద ‘దైవ ద్రోహులు’ పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. మునులు హోమం చేస్తుంటే రాక్షసుల్లా చిత్రీకరించిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చెరోవైపు రక్తాన్ని హోమ గుండంలోకి వంపుతున్నట్లు ఆ ఫ్లెక్సీపై ఉంది. సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు భూమన నివాసం వద్దకు చేరుకుని... అభ్యంతకర ఫెక్సీని తొలగించారు. పోలీసులు వెళ్లిన కొద్ది సేపటికి విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు భూమన నివాసం వద్దకు చేరుకున్నాయి. తమ అధినేతల ఫొటోలను అభ్యంతరకరంగా ముంద్రించడాన్ని సహించేది లేదంటూ హెచ్చరించారు. అనంతరం తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ చేరుకుని సీఎం, డిప్యూటీ సీఎంలను అవమానిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఐ సునీల్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై శుక్రవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. కరుణాకర్‌రెడ్డి, ఫెక్సీ తయారీదారు సహా మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

Updated Date - Jan 31 , 2026 | 04:59 AM