Share News

రాజీనామా చేయండి

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:39 AM

సోషల్‌ మీడియా వేదికగా టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు రాసలీలల వీడియో వెలుగులోకి వచ్చిందని, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని...

రాజీనామా చేయండి

  • బీఆర్‌ నాయుడును డిమాండ్‌ చేసిన భూమన

  • అది ఏఐ ఆధారిత వీడియో కాదని వ్యాఖ్య

తిరుపతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియా వేదికగా టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు రాసలీలల వీడియో వెలుగులోకి వచ్చిందని, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అది ఏఐ టెక్నాలజీకి సంబంధించిన వీడియో కాదన్నారు. ఈ విషయం నిపుణులే ధ్రువీకరించారంటూ ఓ రిపోర్టును భూమన చూపించారు. ఆ వీడియోలో కనిపించిన మహిళతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని స్పష్టంగా బీఆర్‌ నాయుడే చెప్పారన్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌కు ఆ మహిళ రాసిన లేఖ ఇది అంటూ.. కొన్ని పేపర్లు భూమన చూపించారు. ‘రిలేషన్‌షి్‌ప విత్‌ బీఆర్‌ నాయుడు’ అంటూ ఆమె రాసిన లేఖను చదివి వినిపించారు. సీఎం చంద్రబాబు తొలగించకముందే నాయుడు పదవినుంచి గౌరవంగా వైదొలగాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 03 , 2026 | 04:39 AM