భోజరాజపురానికి రోడ్డేశారు!
ABN , Publish Date - May 16 , 2026 | 04:33 AM
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం భోజరాజపురం గ్రామానికి కొన్ని దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం లేదు. ఈ గ్రామంలో 250 మందికిపైగా జనాభా ఉంటారు.
దశాబ్దాల కల నెరవేర్చిన మంత్రి కొండపల్లి
ఇంటర్నెట్ డెస్క్: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం భోజరాజపురం గ్రామానికి కొన్ని దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం లేదు. ఈ గ్రామంలో 250 మందికిపైగా జనాభా ఉంటారు. ప్రతీ ఎన్నికలకు అభ్యర్థులు ఈ గ్రామానికి వచ్చి.. రోడ్డు వేస్తామని హామీ ఇవ్వడం, శంకుస్థాపన చేయడం... ఆతర్వాత మరచిపోవడం జరుగుతోంది. దీంతో, గత ఎన్నికల ముందు.. గ్రామానికి రోడ్డు వేయకుంటే పోలింగ్‌ను బహిష్కరిస్తామని చెప్పి.. గ్రామస్థులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గ్రామానికి వెళ్లి.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్డు వేస్తామని, రోడ్డు వేశాకే మళ్లీ గ్రామానికి వస్తానని మాటిచ్చారు. చెప్పిన మాట ప్రకారం.. రూ.2కోట్లతో రోడ్డు నిర్మించారు. శుక్రవారం గ్రామస్థులు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లగా.. ఆ రోడ్డుకు మంత్రి కొండపల్లి ప్రారంభోత్సవం చేశారు.
- దత్తిరాజేరు