Share News

యావత్‌ దేశం ఆగస్టు 1న భోగాపురంవైపే చూడాలి

ABN , Publish Date - Jul 25 , 2026 | 05:53 AM

‘దేశం యావత్తు ఆగస్టు 1న భోగాపురం వైపే చూసేలా ప్రధాని మోదీకి గౌరవ మర్యాదలతో కూడిన ఏర్పాట్లు చేయాలి. ఎక్కడా తేడా లేకుండా సమన్వయంతో ఏర్పాట్లు పక్కాగా ఉండాలి’ అని మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు.

యావత్‌ దేశం ఆగస్టు 1న భోగాపురంవైపే చూడాలి

  • 13 వేల మందితో అతిపెద్ద థింసా నృత్య ప్రదర్శన

  • 3 లక్షల మంది ప్రధాని సభకు హాజరవుతారు.. మంత్రి లోకేశ్‌ సమీక్ష

విజయనగరం, జూలై 24(ఆంధ్రజ్యోతి): ‘దేశం యావత్తు ఆగస్టు 1న భోగాపురం వైపే చూసేలా ప్రధాని మోదీకి గౌరవ మర్యాదలతో కూడిన ఏర్పాట్లు చేయాలి. ఎక్కడా తేడా లేకుండా సమన్వయంతో ఏర్పాట్లు పక్కాగా ఉండాలి’ అని మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. శుక్రవారం భోగాపురం విమానాశ్రయం ప్రాంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ఉత్తరాంధ్రకే తలమానికంగా భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం రూపుదిద్దుకుంది. ఆగస్టు 1 ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని జాతికి అంకితం చేస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్‌ అనే రీతిలో విజయవంతం చేయాలి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మంది ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం, ప్రధాని మోదీ బహిరంగ సభకు హజరవుతారు. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలి. ‘ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతూ 13 వేల మందితో దేశంలోనే అతి పెద్ద ఽథింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలి సభకు వచ్చేవారికి భోజన సదుపాయాల్లో ఎలాంటి లోటులేకుండా మండలస్థాయి లైజన్‌ ఆఫీసర్లు దగ్గరుండి చూసుకోవాలి. అని ఆదేశించారు. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్ల కమిటీ సమన్వయకర్త ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ... ప్రధాని బహిరంగ సభకు వీక్షించేందుకు ప్రతి 5 వేల మందికి ఒక ఎల్‌ఈడీ స్ర్కీన్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న వస్తున్న సందర్భంగా భద్రత ఏర్పాట్లను డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా శుక్రవారం పరిశీలించారు. భద్రతఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

Updated Date - Jul 25 , 2026 | 05:55 AM