Share News

‘భోగాపురం’ ప్రారంభానికి ప్రధాని మోదీ

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:12 AM

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయ ుని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

‘భోగాపురం’ ప్రారంభానికి ప్రధాని మోదీ

  • జూలై 5న ఆయన చేతుల మీదుగా జాతికి అంకితం

  • శరవేగంగా ఎయిర్‌పోర్టు పనులు: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళం/విజయనగరం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయ ుని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. జూలై 5న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 50 ఎయిర్‌పోర్టులు, పదేళ్లలో 100 ఎయిర్‌పోర్టులు, 200 హెలీప్యాడ్‌లు నిర్మించాలని ప్రధాని మోదీ నిర్దేశించారని చెప్పా రు. అమరావతి చట్టబద్ధతపై ఆయన మా ట్లాడుతూ.. బిల్లును వ్యతిరేకించి వైసీపీ నేత లు చరిత్రహీనులుగా మిగిలిపోయారని చె ప్పారు. జగన్‌ తానా అంటే తందానా అనే వైసీపీ నేతలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. అమరావతి అంటే రాష్ట్ర ప్రజల ఐక్యతకు ప్రతీక అని చెప్పారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ భూదందాలకు పా ల్పడిందని, రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమేవారి అజెండా అని విమర్శించారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

98 శాతంపైగా పనులు పూర్తి

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ ఎయిర్‌పోర్టును మోదీ చేతులు మీదుగా జాతికి అంకితం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విమానాశ్రయం పనులు 98.74 శాతం పూర్తయ్యాయి. ఎర్త్‌ వర్కు, రన్‌వే, ట్యాక్సీవే 100 శాతం అయిపోయాయి. చెక్‌ ఇన్‌ కౌంటర్లు 40, ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్లు 26, రన్‌వే 3,800 మీటర్లు పూర్తయ్యాయి. 18 విమానాలు నిలిపే సామర్థ్యంతో ఏప్రాన్‌ ఏర్పాటు చేశారు. దేశంలోనే అతి పెద్ద ఎయిర్‌పోర్టుగా భోగాపురం నిలవనుంది. అలాగే ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా వచ్చేలా కనెక్టివిటీ రోడ్లు చురుగ్గా వేస్తున్నారు. అనుకున్న సమయానికి సిద్ధం చేయాలని జీఎంఆర్‌ సంస్థకు ప్రభుత్వం సూచించింది.

Updated Date - Apr 11 , 2026 | 03:12 AM