‘భోగాపురం’ కర్త, కర్మ, క్రియ బాబే: కలిశెట్టి
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:51 AM
నాడు.. ఎర్ర బస్సు రాని భోగాపురానికి ఎయిర్‌పోర్టా అని ప్రశ్నించిన జగన్.. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్డు క్రెడిట్ తమదేనని అనడం సిగ్గుచేటని...
అమరావతి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): నాడు.. ఎర్ర బస్సు రాని భోగాపురానికి ఎయిర్‌పోర్టా అని ప్రశ్నించిన జగన్.. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్డు క్రెడిట్ తమదేనని అనడం సిగ్గుచేటని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మట్లాడారు. కొబ్బరికాయ కొట్టగానే క్రెడిట్ రాదని జగన్ గ్రహించాలన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.