Share News

భీమిలి విశ్రాంత తహసీల్దారుకు జైలు, జరిమానా

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:38 AM

పట్టాదారు పాస్‌ పుస్తకం జారీకి లంచం కేసులో అప్పటి భీమిలి తహసీల్దార్‌ ఎస్‌.సిద్ధయ్యకు ఏసీబీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.

భీమిలి విశ్రాంత తహసీల్దారుకు జైలు, జరిమానా

భీమునిపట్నం రూరల్‌(విశాఖపట్నం జిల్లా), ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): పట్టాదారు పాస్‌ పుస్తకం జారీకి లంచం కేసులో అప్పటి భీమిలి తహసీల్దార్‌ ఎస్‌.సిద్ధయ్యకు ఏసీబీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. భీమిలి తహసీల్దార్‌గా సిద్ధయ్య 2014లో బాధ్యతలు చేపట్టారు. కృష్ణంరాజుపేట గ్రామానికి చెందిన సోదరులు ఎస్‌.వెంకటరావు, ఎస్‌.సత్యనారాయణ మజ్జివలస గ్రామంలో 33 సెంట్ల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. దానికి పట్టాదారు పుస్తకం కావాలని దరఖాస్తు చేశారు. తహసీల్దార్‌ రూ.15 వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో సోదరులు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచన మేరకు 2015 ఫిబ్రవరి 9న తహసీల్దార్‌ కార్యాలయానికి డబ్బుతో వెళ్లారు. లంచం తీసుకుంటుండగా సిద్ధయ్యను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Updated Date - Feb 07 , 2026 | 04:39 AM