మరో ఏడాదిపాటు ట్రాన్స్ కో డైరెక్టర్‌గా భాస్కర్
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:14 AM
ఏపీ ట్రాన్స్‌కోలో గ్రిడ్, ట్రాన్స్‌మిషన్ అండ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న ఏకేవీ భాస్కర్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఏపీ ట్రాన్స్‌కోలో గ్రిడ్, ట్రాన్స్‌మిషన్ అండ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న ఏకేవీ భాస్కర్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వైసీపీ హయాంలో ట్రాన్స్‌కోలో చీఫ్ ఇంజనీరుగా పనిచేసిన భాస్కర్ 2022, మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ తరువాత వారం రోజులకే ఆయన్ను రెండేళ్లపాటు ట్రాన్స్‌కో డైరెక్టర్‌గా నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత 2024, ఏప్రిల్‌లో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం మరో రెండేళ్లు ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది.