Share News

సత్తా చాటిన భాష్యం

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:41 AM

ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు.

సత్తా చాటిన భాష్యం

గుంటూరు(విద్య), ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. బుధవారం విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో జూనియర్‌ బైపీసీ విభాగంలో భాష్యం మెడెక్స్‌ విద్యార్థి టి.దుర్గాగితిక 455 మార్కులకుగానూ 452 మార్కులు సాధించారన్నారు. సీనియర్‌ బైపీసీ విభాగంలో బి.సాయిహర్షిత 1000 మార్కులకుగాను 992 మార్కులు సాధించారని తెలిపారు. జూనియర్‌ ఎంపీసీ విభాగంలో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థి ఎన్‌.ఆశ్రేష 470 మార్కులకుగానూ 467 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. సీనియర్‌ ఎంపీసీ విభాగంలో జి.విష్ణువర్థన్‌, బి.సాయిసాత్విక్‌, జి.ఎన్‌.వి.పవన్‌ కుమార్‌, బి.దినేష్‌ కుమార్‌ 1000 మార్కులకుగానూ 990 మార్కులు సాధించారన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను రామకృష్ణ, వైస్‌ చైౖర్మన్‌ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాష్యం సాకేత్‌ రామ్‌ అభినందించారు.

Updated Date - Apr 16 , 2026 | 04:43 AM