Share News

ఏపీఈఏపీసెట్‌లో ‘భాష్యం’ హవా

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:20 AM

ఏపీఈఏపీసెట్‌-2026 ఫలితాల్లో భాష్యం విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని విద్యాసంస్థల చైర్మన్‌, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ తెలిపారు..

ఏపీఈఏపీసెట్‌లో ‘భాష్యం’ హవా

గుంటూరు(విద్య), జూలై 1(ఆంధ్రజ్యోతి): ఏపీఈఏపీసెట్‌-2026 ఫలితాల్లో భాష్యం విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని విద్యాసంస్థల చైర్మన్‌, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ తెలిపారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఇంజనీరింగ్‌ విభాగంలో వి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి 3వ ర్యాంకు, టి.దుర్గాసుప్రభాత్‌ 4వ ర్యాంకు, బి.ధాత్రిక 5వ ర్యాంకు, వి.ధీరజ్‌కృష్ణ 7వ ర్యాంకు, నూర్‌బాషా హఫీజ్‌ 8వ ర్యాంకు, ఎ.ఎస్.ఎస్.సాయినిఖితారెడ్డి 9వ ర్యాంకులు సాధించారన్నారు. 10లోపు ఆరు ర్యాంకులు, 100లోపు 18 ర్యాంకులతో భాష్యం విద్యార్థులు సత్తా చాటారని చెప్పారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను రామకృష్ణ, వైస్‌ చైర్మన్‌ హనుమంతరావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాకేత్‌రామ్‌ అభినందించారు.

Updated Date - Jul 02 , 2026 | 03:21 AM