Share News

ఒత్తిడిలేని విద్యా విధానమే భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ లక్ష్యం

ABN , Publish Date - Jun 02 , 2026 | 06:15 AM

ఒత్తిడి లేని విద్యావిధానం, ఫౌండేషన్‌ స్థా యి నుంచి అమలు చేసే కరిక్యులమ్‌, అధ్యాపకుల బోధన, విద్యార్థుల అకుంఠిత దీక్షే జాతీయస్థాయిలో ...

ఒత్తిడిలేని విద్యా విధానమే భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ లక్ష్యం

  • సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ

  • జేఈఈ అడ్వాన్స్‌ ర్యాంకర్లకు ఘన సత్కారం

గుంటూరు(విద్య), జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఒత్తిడి లేని విద్యావిధానం, ఫౌండేషన్‌ స్థా యి నుంచి అమలు చేసే కరిక్యులమ్‌, అధ్యాపకుల బోధన, విద్యార్థుల అకుంఠిత దీక్షే జాతీయస్థాయిలో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యాసంస్థలు సాధించే ర్యాంకులకు కారణమని సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ స్పష్టం చేశారు. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను గుంటూరు మెయిన్‌ క్యాంప్‌సలో సోమవారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఓపెన్‌ కేటగిరిలో జాతీయ స్థాయిలో 34వ ర్యాంకు సాఽధించిన వెన్నా ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి 6వ తరగతి నుంచే భాష్యం ఐఐటీ ఫౌండేషన్‌ ద్వారా శిక్షణ పొందినట్టు తెలిపారు. నిష్ణాతులైన అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణతో ఐఐటీ ఫౌండేషన్‌ శిక్షణ తరగతులు ఉంటాయని వెల్లడించారు. ఫలితంగానే వేర్వేరు విభాగాల్లో తమ విద్యార్థులు జక్కం చాము వర్షిత్‌ 3వ ర్యాంకు, సిహెచ్‌.సాహిల్‌ 6వ ర్యాంకు, డి.పవన్‌ 16వ ర్యాంకు, కె.రామకృష్ణారెడ్డి 23వ ర్యాంకు, వి.ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి 34వ ర్యాంకు, హఫీజ్‌ నూర్‌బాషా 42వ ర్యాంకు, వై.ప్రవచన 54వ ర్యాంకు, ఆర్‌.బాలానాయక్‌ 76వ ర్యాంకు, సీహెచ్‌.వెంకట నాగపవన్‌ ఆలిండియా 82వ ర్యాంకు సాధించారని చెప్పారు. పోటీ పరీక్షలు ఏవైనాసరే ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అగ్రస్థానంలో నిలుస్తున్నారని తెలిపారు. ఇటీవల జేఈఈ మెయిన్‌ ఓపెన్‌ కేటగీరిలో 100 పర్సంటైల్‌తో పాటు ఆలిండియా 11వ ర్యాంకు సాధించిన టి.దుర్గా సుప్రభాత్‌కు ఉన్నత చదువు నిమిత్తం రూ.10 లక్షలు ప్రోత్సాహకం అందించినట్టు తెలిపారు. ర్యాంకులు సాఽధించిన విద్యార్థిని, విద్యార్థులను చైర్మన్‌ భాష్యం రామకృష్ణ, వైస్‌ ఛైర్మన్‌ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాష్యం సాకేత్‌ రామ్‌, భాష్యం ఐఐటీ కోఆర్డినేటర్‌ ఆనందకుమార్‌ తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 06:15 AM