జేఈఈ మెయిన్‌లో భాష్యం విజయభేరి
ABN , Publish Date - Apr 21 , 2026 | 05:23 AM
జెఈఈ మెయిన్- 2026 ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు.
గుంటూరు(విద్య), ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): జెఈఈ మెయిన్- 2026 ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. సోమవారం గుంటూరు లోని భాష్యం మెయిన్ క్యాంవ్‌సలో ఆయన విద్యార్థులను అభినందించారు. ఏప్రిల్‌లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో టి.దుర్గా సుప్రభాత్ ఆంధ్రప్రదేశ్ నుంచి 100 పర్సంటైల్ సాధించి చరిత్ర సృష్టించాడని తెలిపారు. దుర్గా సుప్రభాత్ 100 పర్సంటైల్‌తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 11వ ర్యాంకును సాధించినట్టు వెల్లడించారు. వివిధ కేటగిరీల్లో జేసీహెచ్ వర్షిత్ ఆలిండియా 5వ ర్యాంకు, డి.పవన్ 6వ ర్యాంకు, టి.దుర్గా సుప్రభాత్ 11వ ర్యాంకు, ఆర్.బాలానాయక్ 24వ ర్యాంకు, కె. రామకృష్ణారెడ్డి 62, సీహెచ్.ప్రణయ్ 83, వై.యశస్వి 99, ఎం.బాలసాయిరామ్ 123, కె.కేశవకుమార్ సాయికృష్ణ 135, నూర్ బాషా హఫీజ్ ఆలిండియా 140వ ర్యాంకు సాధించినట్టు వివరించారు. ఇంకా 150లోపు 10 ర్యాంకులు 200లోపు 28, 500లోపు 60, 1000లోపు 82 ర్యాంకులు కైవసం చేసుకొని 73.24ు నక్సెస్ రేట్‌తో సత్తా చాటారన్నారు. విద్యార్థులను వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, ఎండీ భాష్యం సాకేత్ రామ్, ఐఐటి ప్రోగ్రామర్ ఎం ఆనంద్ కుమార్ అభినందించారు.