Share News

ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ చైర్మన్‌గా భరత్‌ భూషణ్‌

ABN , Publish Date - May 22 , 2026 | 05:54 AM

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ ) చైర్మన్‌గా పి.భరత్‌ భూషణ్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది.

ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ చైర్మన్‌గా భరత్‌ భూషణ్‌

అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ ) చైర్మన్‌గా పి.భరత్‌ భూషణ్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. వైస్‌చైర్మన్‌గా చిక్కాల మెహర్‌ రమే్‌షకుమార్‌కు అవకాశం కల్పించింది. డైరెక్టర్లుగా 13 మంది పేర్లను ప్రకటించింది. వీరిలో సుమన్‌ తల్వార్‌, ఎస్‌.శివాజీ, చదలవాడ శ్రీనివాసరావు, బుర్రా సాయిమాధవ్‌, వై.ఝాన్సీ, కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద, వి.సముద్ర, కె.ఉమామహేశ్వరరావు, మీర్‌.ఎస్‌, కందిమళ్ల సాంబశివరావు, ఎస్‌.వెంకట కృష్ణారెడ్డి, జి.రాజ్‌వెంకటేశ్వర యాదవ్‌, డి.సత్యనారాయణ ఉన్నారు. ఈ 15 మందితో ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీ బోర్డును ప్రభుత్వం నియమించింది.

Updated Date - May 22 , 2026 | 05:54 AM