Share News

భక్తజన మఠం

ABN , Publish Date - Mar 01 , 2026 | 11:02 PM

ధ్మాత్మిక క్షేత్రం మంత్రాలయంలోని శ్రీమఠం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

   భక్తజన మఠం
శ్రీమఠం మధ్వమార్గ్‌ కారిడార్‌లో కిక్కిరిసిన భక్తులు

మంత్రాలయం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఆధ్మాత్మిక క్షేత్రం మంత్రాలయంలోని శ్రీమఠం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. సెలవు రోజు కావడంతో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో మఠం ప్రాంగణం రద్దీగా కనిపించింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహాదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నది తీరం భక్తులతో కోలాహలంగా మారింది. భక్తులు తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

Updated Date - Mar 01 , 2026 | 11:02 PM