ఘనంగా భగీరథ మహర్షి జయంతి
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:42 PM
పట్టణంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను గురువారం సగర (ఉప్పర) సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
పత్తికొండ టౌన్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను గురువారం సగర (ఉప్పర) సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉప్పరకట్ట దగ్గర భగీరథ చిత్రపటానికి సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణలో మహర్షి చిత్రపటాన్ని ఊరేగించారు. ఈ సందర్భంగా ఉప్పర సంఘం నాయకులు బాలప్ప, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భగీరథ సేవలను కొనియాడారు. ఉప్పరలకు కార్పొరేషన్ ద్వారా రుణాలను అందించాలని కోరారు. కార్యక్రమంలో ఉప్పర సంఘం నాయకులు టీచర్ నరసింహమూర్తి, పెద్ద సుంకన్న, రవి, వరలక్ష్మి, నాగరాజు, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు టీడీపీతోనే న్యాయం
మద్దికెర: రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలకు తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుందని జడ్పీటీసీ మాజీ సభ్యులు జమేదార్ రాజన్న యాదవ్ అన్నారు. గురువారం ఆర్యవైశ్య కళ్యాణమండపంలో సగరుల ఆరాధ్యదేవుడైన భగీరథ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ముందుగా భగీరథుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భగీరథ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నాయకులు గడ్డం రామాంజనేయులు, ఈడిగ చంద్రశేఖర్ గౌడు, ఎన.లక్ష్మీనారాయణ, పెరవలి రామాంజులు, ఎడవలి ఆనంద్, చంద్ర, సజీ, దేవేంద్ర రాము పాల్గొన్నారు.