Share News

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి..

ABN , Publish Date - Mar 27 , 2026 | 05:19 AM

శ్రీరామ నవమి నాడు భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీక్షించడం ఒక భాగ్యమయితే...ఆ కల్యాణ తలంబ్రాలను అందుకోవడం మరింత అదృష్టంగా భక్తులు భావిస్తారు.

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి..

  • భద్రాద్రి రామయ్య కల్యాణానికి చీరాల తలంబ్రాలు

  • 2013 నుంచి పంపుతున్న బాలకేశవులు కుటుంబీకులు

చీరాల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): శ్రీరామ నవమి నాడు భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీక్షించడం ఒక భాగ్యమయితే...ఆ కల్యాణ తలంబ్రాలను అందుకోవడం మరింత అదృష్టంగా భక్తులు భావిస్తారు. చీరాల మునిసిపల్‌ పరిధిలోని పాపరాజుతోటకు చెందిన పొత్తూరి బాలకేశవులు కుటుంబం నేతృత్వంలో 2013 నుంచి కోటి గోటి తలంబ్రాలు సిద్ధం చేసి భద్రాచలం పంపుతున్నారు. ఈక్రమంలోనే గతేడాది సరిగ్గా విజయదశమి నుంచి ఈ ఏడాది ఉగాది వరకు భక్తి శ్రద్ధలతో 25 క్వింటాళ్లు తయారుచేశారు. 2 టన్నులు గింజలను పసుపు, కుంకుమ, ఆవునెయ్యి, నూనె, గులాము, జాస్మిన్‌తో కలగలిపి అక్షితలుగా మారుస్తారు. గోటి తలంబ్రాలను బుధవారం రాత్రి భద్రాచలం పంపించారు. కాగా.. గోటి తలంబ్రాల కోసం విదేశాల నుంచి కొరియర్‌ ద్వారా వడ్లు పంపి భక్తిశ్రద్ధలతో తలంబ్రాలకు సహకరిస్తారని బాలకేశవులు తెలిపారు. స్వామికి సేవ చేసే భాగ్యంతో తన జన్మ ధన్యమైందన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 05:19 AM