పేదలకు మెరుగైన వైద్యసేవలు
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:06 AM
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే బుడ్డా రాశేఖర్‌రెడ్డి అన్నారు.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
వెలుగోడు ప్రభుత్వ వైద్యశాలలో
ఎక్స్‌రే యూనిట్ ప్రారంభం
వెలుగోడు, జనవరి 27 ( ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే బుడ్డా రాశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వెలుగోడు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో రూ. 10 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్‌రే యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వైద్యాధికారులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకవచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ఆసుపత్రి ప్రాంగణంలో ఆర్వోప్లాంటులను ఏర్పాటు చేసి తాగునీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు, చిన్నారుల ఐసీయూ సెంటరును ఇరుకుగా ఉండటంతో పైఅంతస్థుకు మార్చేందుకు కృషి చేస్తామన్నారు. వైద్యుల ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
విద్యతోనే భవిష్యత్తు
విద్యతోనే భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వెలుగోడు శివార్లలోని ఏపీ మోడల్‌స్కూల్ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులు బాగా చదువుకొని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అలాగే పాఠశాలలోని పలు సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అంతకుముందు పాఠశాలలో అంతర్గత రహదారుల ని ర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నళిని , అ ధ్యాపకులు, టీడీపీ నాయకులు అన్నారపు శేషిరెడ్డి, కలాం, శంకరరెడ్డి, జాఖీర్, ఎల్లాల కృష్ణుడు, రసూల్ ,వీరభద్రుడు, ఖలీల్ పాల్గొన్నారు.