ఉత్తమ సేవకులు
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:36 AM
ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ విజయవాడ ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణను మహోన్నత సేవాపతకం, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ పి.సత్యానందంను ఉత్తమ సేవా పతకం వరించాయి. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందజేసిన వారికి ప్రభుత్వం ఉగాది రోజున ప్రదానం చేసే పతకాలకు ఎంపికైన వారి జాబితాను సోమవారం ప్రకటించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ పతకాలు లభించాయి.
ఏడీసీపీ రామకృష్ణకు మహోన్నత సేవా పతకం
ఎస్‌బీ ఏసీపీ సత్యానందంకు ఉత్తమ సేవా పతకం
పలు పతకాలకు ఉమ్మడి జిల్లా పోలీసుల ఎంపిక
ఉగాది రోజున ప్రదానం చేయనున్న ప్రభుత్వం
విజయవాడ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి):
ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ విజయవాడ ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణను మహోన్నత సేవాపతకం, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ పి.సత్యానందంను ఉత్తమ సేవా పతకం వరించాయి. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందజేసిన వారికి ప్రభుత్వం ఉగాది రోజున ప్రదానం చేసే పతకాలకు ఎంపికైన వారి జాబితాను సోమవారం ప్రకటించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ పతకాలు లభించాయి. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ కె.మధుసూదనరావుకు మహోన్నత సేవా పతకం లభించింది. ఉత్తమ సేవా పతకానికి గుడివాడ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఇ.రమణమ్మ, విజయవాడ మహిళా పీఎస్ ఎస్‌ఐ ఎం.ప్రేమలత, ఐఎస్‌డబ్ల్యూ హెచ్‌సీ జి.రామచంద్రారెడ్డి, ఎన్టీఆర్ కమిషనరేట్ ఐటీ కోర్ విభాగం పీసీ బి.వెంకటేశ్వరరావు, కృష్ణాజిల్లా ఒర్లగొందితిప్ప సీఎస్‌పీఎస్‌కు చెందిన వీజే రమణమూర్తి, జెన్‌కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అదనపు ఎస్పీ జి.చంద్రబాబు ఎంపికయ్యారు. సేవా పతకానికి కృష్ణాజిల్లా ఎస్‌ఐ సర్వార్ అలీ బేగ్, విజయవాడ ట్రాఫిక్-1 ఏసీపీ పి.రామచంద్రరావు, ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్ ఎ.సుబ్రహ్మణ్యం, ఐఎస్‌డబ్ల్యూ ఇన్‌స్పెక్టర్ డి.సూర్యప్రకాశరావు, విజయవాడ నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఇన్‌స్పెక్టర్ ఎం.రవీంద్ర, కృష్ణాజిల్లా ఏఎస్‌ఐ జె.శ్రీనివాసు, హెచ్‌సీ ఎం.దక్షణామూర్తి, ఏఆర్‌ఎస్‌ఐ బి.భద్రు, కానిస్టేబుల్ బి.ఆదిబాబు, హెచ్‌సీ పి.ప్రసాద్, కె.చంద్రబాబు, పీసీ వి.విజయ్, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ఏఎస్‌ఐ డి.మంగ్య, విజయవాడ సీసీఆర్‌బీ ఏఎస్‌ఐ బి.రవికిరణ్, సూర్యరావుపేట హెచ్‌సీ కె.శ్రీనివాసరావు, సైబర్ క్రైం హెచ్‌సీ జి.రాజేష్, తిరువూరు హెచ్‌సీ ఆర్.రామచంద్రరావు, ఏఆర్‌హెచ్‌సీ పీవీకే మోహనరావు, పటమట హెచ్‌సీ ఎ.దుర్గారావు, సీటీఎఫ్ హెచ్‌సీ అబ్దుల్ ఖలీం, సీసీఆర్‌బీ హెచ్‌సీ ఎండీ ఇస్మాయిల్, స్పెషల్ బ్రాంచ్ పీసీ టి.కోటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ హెచ్‌సీ కె.పాండురాజు, పీసీ హెచ్‌ఎన్ మల్లేశ్వరరావు, విజయవాడ ఏఆర్‌ఎస్‌ఐ ఎం.ప్రసాదరావు ఎంపికయ్యారు.
అగ్నిమాపక విభాగంలో..
ఎన్టీఆర్ జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావును ఉత్తమ సేవాపతకం వరించింది. సేవా పతకానికి అగ్నిమాపక శాఖ దక్షిణ ప్రాంత అదనపు సంచాలకుడు ఆర్.జ్ఞానసుందరం, కృష్ణాజిల్లా మొవ్వ స్టేషన్ ఫైర్ అధికారి కె.వెంకటేశ్వరరావు, మచిలీపట్నం ఫైర్‌మన్ బి.లక్ష్మీనారాయణ, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లీడింగ్ ఫైర్‌మన్ బి.సునీల్‌కుమార్, కె.వెంటరత్నం(ఆటోనగర్), డ్రైవర్ ఆపరేటర్ టి.ఆంజనేయులు ఎంపికయ్యారు.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో
విజయవాడ ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ కె.వెంకటేశ్వర్లును మహోన్నత సేవా పతకం వరించింది. పోలీస్ సేవా పతకానికి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రధాన కార్యాలయ ఎస్‌ఐ ఆర్.రవీంద్రరెడ్డి, విజయవాడ ప్రాంతీయ కార్యాలయం పీసీ బొమ్మిడి రవిశేఖర్, ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఏఆర్‌పీసీ ఎం.బాలాజీ ఎంపికయ్యారు. ప్రత్యేక భద్రతా దళానికి సంబంధించి సేవా పతకానికి ఎన్టీపీఎస్ హెచ్‌సీలు ఎన్‌వీఎస్ రామాంజనేయులు, ఎం.శివరంగ రెడ్డి, విజయవాడ గార్డ్స్ హెచ్‌సీ కె.హనుమంతరావు, ప్రధాన కార్యాలయ కానిస్టేబుళ్లు ఎస్.ఏడుకొండలరెడ్డి, వై.వరంబాబు ఎంపికయ్యారు.