Share News

‘బెనెక్స్‌ కామ్‌’ నిందితుల రిమాండ్‌ పొడిగింపు

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:21 AM

బెనెక్స్‌ కామ్‌ గ్రూపు ద్వారా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతూ పట్టుబడి రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న 11 మందికి విజయవాడ చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది.

‘బెనెక్స్‌ కామ్‌’ నిందితుల రిమాండ్‌ పొడిగింపు

విజయవాడ, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): బెనెక్స్‌ కామ్‌ గ్రూపు ద్వారా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతూ పట్టుబడి రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న 11 మందికి విజయవాడ చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. విజయవాడకు చెందిన రెహ్మతుల్లా షరీఫ్‌, డానిష్‌, సొహైల్‌ బేగ్‌, చంచల్‌గూడకు చెందిన సయిదా బేగం, బళ్లారికి చెందిన అబ్దుల్‌ సలాంలను పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు. అలాగే, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న షద్మాన్‌ దిల్కష్‌, లక్కీ అహ్మద్‌, జిషాన్‌, మిర్‌ ఆసిఫ్‌ అలీ, షారూక్‌ఖాన్‌, ఫయాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌లను వర్చ్యువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. వీరందరికీ ఈనెల 20వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయాధికారి బి.రాధారాణి ఆదేశాలు ఇచ్చారు.

Updated Date - Apr 07 , 2026 | 04:23 AM