Share News

పీఎం సూర్యఘర్‌తో లబ్ధి

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:58 PM

ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకంతో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత అందడంతో పాటు ఆర్థికంగా ఎదిగేలా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.

పీఎం సూర్యఘర్‌తో లబ్ధి
సోలార్‌ ప్యానెళ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

తుగ్గలి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకంతో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత అందడంతో పాటు ఆర్థికంగా ఎదిగేలా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. మంగళవారం జొన్నగిరిలో ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకాన్ని ప్రారంభించారు. అలాగే లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానెళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ విద్యుత వినియోగదారులకు ఉచిత రూప్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్లు అందిస్తున్నామని, ఇందులో భాగంగానే జొన్నగిరిలో 138 మందికి ఒక్కో ప్లాంటు ఏర్పాటు చేసేందుకు రూ.2.50లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా విద్యుత అందించడమే కాకుండా వారే ప్రభుత్వానికి విద్యుతను అందించి ఆర్థికంగా కూడా ఎదగవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ పథకా న్ని వినియోగించుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో సాగు, తాగునీరు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. టీడీపీ నాయకులు బత్తిన వెంకట్రాముడు, వెంకటపతి, తిరుపాల్‌ నాయుడు, మిద్దె వెంకటేశ, మిద్దె రవి, బాలన్న, లక్ష్మణస్వామి, డీఈ జయరామ్‌రాజ్‌, ఏడీఈ మధుసూదన, ఏఈలు సుజాత, మహేశ్వరరెడ్డి, లైనమెన రామ్‌దాసు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 11:58 PM