Share News

బీఈడీ కాలేజీలపై కొరడా

ABN , Publish Date - Jan 31 , 2026 | 05:07 AM

బీఈడీ కాలేజీల్లో ఉల్లంఘనలపై ఉన్నత విద్యామండలి కొరఢా ఝుళిపించింది. సబ్జెక్టు మెథడాలజీలో ఉల్లంఘనలకు గాను కాలేజీ యాజమాన్యాలపై భారీ జరిమానా విధించింది.

బీఈడీ కాలేజీలపై కొరడా

  • సబ్జెక్టు మెథడాలజీలో ఉల్లంఘనలు గుర్తింపు

  • ఒక్కో అడ్మిషన్‌పై రూ.3 వేలు పెనాల్టీ కట్టండి

  • సుమారు 5వేల అడ్మిషన్లపై జరిమానా విధింపు

అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): బీఈడీ కాలేజీల్లో ఉల్లంఘనలపై ఉన్నత విద్యామండలి కొరఢా ఝుళిపించింది. సబ్జెక్టు మెథడాలజీలో ఉల్లంఘనలకు గాను కాలేజీ యాజమాన్యాలపై భారీ జరిమానా విధించింది. మెథడాలజీ ఉల్లంఘనలతో చేపట్టిన ఒక్కో అడ్మిషన్‌పై రూ.3వేలు చొప్పున సుమారు 5వేల అడ్మిషన్లపై జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఉన్నత విద్యామండలి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 2008లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 31 ప్రకారం బీఈడీ కాలేజీలు మెథడాలజీని తప్పనిసరిగా అమలుచేయాలి. ఆయా కాలేజీల్లో ఉన్న మొత్తం సీట్లలో 25 శాతం గణితం కోర్సులతో భర్తీ చేయాలి. ఫిజిక్స్‌, బయాలజీకి 30 శాతం సీట్లు ఉంటాయి. వీటిలో కనిష్ఠంగా 10 శాతం, గరిష్ఠంగా 20శాతం సీట్లను పరస్పరం మార్చుకోవచ్చు. సోషల్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌ కోర్సులకు 45 శాతం సీట్లు ఉంటాయి. వాటిలో 10-15 శాతం సీట్లు మార్చుకోవచ్చు. అయితే చాలా కాలేజీలు ఈ పరిమితిని దాటి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు మండలి గుర్తించి కాలేజీలను వివరాలు కోరింది. ఇప్పటివరకూ 284 కాలేజీలు ఆ సమాచారం సమర్పించాయి. చాలావరకు కాలేజీలు మెథడాలజీని ఉల్లంఘిస్తున్నాయి. దీంతో సీరియస్‌ అయిన మండలి భారీగా జరిమానాలు విధించింది.

Updated Date - Jan 31 , 2026 | 05:07 AM