రమణీయం.. నారసింహుడి రథోత్సవం
ABN , Publish Date - May 06 , 2026 | 12:21 AM
మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు విశేష సాంస్కృతిక కార్యక్రమాలు అశేష భక్తజన సందోహం మధ్య లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం రమణీయంగా సాగింది.
కొలిమిగుండ్ల, మే 5 (ఆంధ్రజ్యోతి): మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు విశేష సాంస్కృతిక కార్యక్రమాలు అశేష భక్తజన సందోహం మధ్య లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం రమణీయంగా సాగింది. మంగళవారం సాయంత్రం కొలిమిగుండ్ల మండల కేంద్రంలో స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు దేవాదాయశాఖ రథోత్సవాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.