Share News

రమణీయం.. రథోత్సవాలు

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:37 AM

మండల పరిధిలోని కడమకుంట్ల, రోళ్లపాడు తండా సమీపంలో అటవీ ప్రాంతంలో వెలసిన క దీరప్ప స్వామికి శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.

రమణీయం.. రథోత్సవాలు
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

తుగ్గలి, ఫిబ్రవరి 27 (ఆంధ్ర జ్యోతి): మండల పరిధిలోని కడమకుంట్ల, రోళ్లపాడు తండా సమీపంలో అటవీ ప్రాంతంలో వెలసిన క దీరప్ప స్వామికి శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం అశేష భక్త జనవాహిని మ ధ్య స్వామి ఉత్సవమూర్తులను రథంపై ఏర్పాటు చేసి లాగారు. అంతకు ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జొన్నగిరి ఎస్‌ఐ మల్లికార్జున బందోబస్తు ఏర్పా టు చేశారు. కార్యక్రమంలో పూజారి వెంకటేశ్వ ర్లు, తులసినాయక్‌, మన్నె నాయక్‌, శ్రీనివాస్‌ నాయక్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:38 AM