Share News

ఇనుప రాడ్డుతో కొట్టి హత్య

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:28 AM

మండలంలో మదార్‌ పురం గ్రామ సమీపంలో ఈనెల 12న అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటనలో మిస్టరీ వీడింది.

ఇనుప రాడ్డుతో కొట్టి హత్య
వివరాలు వెల్లడిస్తున్న సీఐ యుగంధర్‌

వివరాలు వెల్లడించిన సీఐ యుగంధర్‌

వెల్దుర్తి/టౌన, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): మండలంలో మదార్‌ పురం గ్రామ సమీపంలో ఈనెల 12న అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటనలో మిస్టరీ వీడింది. బుధవారం వెల్దుర్తి పోలీస్‌ స్టేషనలో సీఐ యుగంధర్‌, ఎస్‌ఐ నరేశలు విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని ముందుకెళ్లామని, పీఎం రిపోర్టు, సీసీ ఫుటేజీ ఆధారంగా హత్యకేసు కోణంలో దర్యాప్తు చేశామని తెలిపారు. నంద్యాల జిల్లా డోన పట్టణం సుందర్‌సింగ్‌ కాలనీలో గొల్ల సురేశ, అల్లబకాష్‌, అమ్రేశనాయక్‌ జీవిస్తున్నారు. వీరందరూ కూడా స్నేహితులే. అల్లబకాష్‌, అమ్రేశనాయక్‌ల మీద డోన పోలీ్‌సస్టేషనలో 4,5కేసులతోపాటు, ఇద్దరి మీద రౌడీషీట్‌ ఉంది. నెలక్రితం అల్లబకాష్‌ అన్న నూర్‌బాషా అతని స్నేహితుడు పట్టాశేఖర్‌ ఇరువురు గొడవపడి పెద్దమనుషుల సమక్షంలో ఒకరినొకరు కాళ్లు పట్టుకుంటారు. ఈ రాజీ ప్రక్రియలో అక్కడే ఉన్న సురేశ ఈ విషయాన్ని ఇతరులకు పదేపదే చెప్పడం, అమ్రేశనాయక్‌ భార్యతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని జీర్ణించుకోలేని అల్లబకాశ, అమ్రేశ నాయక్‌లు 12వ తేదీ రాత్రి వెల్దుర్తి మండలం మదార్‌పురం గ్రామ సమీపంలో జాతీయరహదారి-44 ఆనుకొని ఉన్న కోళ్లఫామ్‌ షెడ్డులో మద్యం సేవిస్తున్నాడు. అనుకోకుండా గొల్లసురేశ కూడా మధ్యలో మందు తాగడానికి వచ్చాడు. దీంతో ఇరువురు అల్లబకాష్‌, అమ్రేశనాయక్‌లు సురేశకు మద్యం ఎక్కువ తాపించి ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు. బుధవారం అల్లబకాష్‌, అమ్రేశనాయక్‌లు తమ వస్తువులు తీసుకోవడానికి కోళ్లఫామ్‌ వద్ద ఉన్నారన్న సమాచా రం మేరకు సిబ్బందితో వెళ్లి దాడిచేసి అరెస్టు చేశామని సీఐ తెలిపారు. దాడిలో వారు ఉపయోగించిన ఇనుపరాడ్డు, కొడవలి, ఇటుక తదితర వస్తువులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. నిందితులను రిమాండ్‌ నిమిత్తం డోన కోర్టుకు తరలించామని తెలిపారు. ఏఎ్‌సఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 12:28 AM