Share News

త్వరపడండి

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:48 AM

జిల్లాలో అనుమతులు తీసుకోని లే–అవుట్ల లో ఇళ్ల స్థలాలు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం విధించిన గడువు ఈ నెల 23తో ముగుస్తోంది.

త్వరపడండి

మూడు నెలల కాలానికి 1,289 దరఖాస్తులు

ఓవరాల్‌గా దరఖాస్తుల ఫీజు రూ.36 కోట్ల పైమాటే

జిల్లాలో అనుమతులు తీసుకోని లే–అవుట్ల లో ఇళ్ల స్థలాలు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం విధించిన గడువు ఈ నెల 23తో ముగుస్తోంది. ఈ ఏడాది జనవరి 23 నుంచి మూడు నెలలపాటు ఎల్‌ఆర్‌ఎస్‌కు గడువు పెంచుతూ అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇడా పరిధిలో రియల్టర్లు స్పందించారు. ఈ దరఖాస్తులన్నీ పరిష్కరిస్తే స్థానిక సంస్థలకు రూ.కోట్లలో ఆదాయం దక్కనుంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌, నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలు, చింతలపూడి నగర పంచాయతీలు ఉన్నాయి. జనవరి 23 నాటికి జిల్లాలో ఓవరాల్‌గా ఇడా, మున్సిపాల్టీల పరిధిలో 5,863 దరఖాస్తులందాయి. తాజాగా గతమూడు నెలలు కాలంలో మొత్తం 1,289 దరఖాస్తు లందగా మొత్తం 7,152 దరఖా స్తులకు గాను 1,070 దర ఖాస్తులు పరిష్కా రమయ్యాయి. ఇప్పటి వరకు ఇడా, పురాలకు కలిపి 36 కోట్ల 60 లక్షల 62 వేల ఆదాయం సమకూరింది. మిగిలిన దాదాపు ఆరువేల దరఖాస్తులను పరిష్కరిస్తే రూ.కోట్లాది ఆదాయం స్థానిక సంస్థలు సమకూరనుంది.

పొడిగింపులతో భరోసా

గత ప్రభుత్వ హయాంలో అనుమతు ల్లేకుండా అడ్డగోలుగా లే–అవుట్లు వేశారు. వీటిలో స్థలాలు కొన్న ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న కూటమి ప్రభుత్వం వాటిని క్రమబద్ధీకరించేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ను పొడి గిస్తూ యజమానులకు భరోసా కల్పిస్తోంది. 2025 నెలాఖరు నాటికి లే–అవుట్‌ అయిన స్థలాలు, ప్లాట్లను క్రమబద్ధీకరణ అవకాశం కల్పించడంతో వేలల్లో దరఖాస్తుదారులు పెరగడానికి అవకాశం ఏర్పడింది. ఓపెన్‌ స్పేస్‌ కింద ప్రభుత్వం ఛార్జీల్లో 50 శాతం రాయితీ ప్రకటించింది. చాలావరకు పలు రాయితీలను కల్పించారు. దీంతో లే–అవుట్ల క్రమబద్ధీకరణతో ఈసారి ఆదాయం దండిగా వస్తుందని భావిస్తున్నారు.

మంత్రి, ఆర్జీడీల తరచూ సమీక్షలు

ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద ప్లాట్లు క్రమబద్ధీకరణపై కొంతకాలం స్టే ఉండటం వల్ల దరఖాస్తులు పరిష్కారం కాలేదు. పది రోజుల క్రితం స్టే ఎత్తివేశారు. ఇప్పుడు అందిన దరఖాస్తులను రాబోయే మూడు నెలలు కాలంలో పరిష్కరించాలని మంత్రి డెడ్‌లైన్‌ విధించారు. ఆ దిశగా అధికారులు క్షేత్రస్థాయిలో రంగం సిద్ధం చేస్తున్నారు. తరచూ పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్షిస్తున్నారు. మరోవైపు రాజమండ్రి టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ ఆర్జేడీ గెడ్డం సుబ్బారావు కూడా ఆయన పరిధిలో 34 పైగా మున్సిపాల్టీలో ఎల్‌ఆర్‌ఎస్‌ సమీక్షలు జరపడం, ఆకస్మిక తనిఖీలతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. ఇటీవల ఆయన జంగారెడ్డిగూడెం, చింతలపూడిల్లో దీనిపై సమీక్షలు జరిపి దరఖాస్తుల పరిష్కారంపై అధికారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈనెల 22 నాటికి అందిన దరఖాస్తులు.. వసూలైన ఫీజులు

పురపాలక సంఘం దరఖాస్తులు ఆమోదం ఫీజులు

ఇడా పరిధిలో 5,752 665 24 కోట్ల 25లక్షల71 వేలు

ఏలూరు కార్పొరేషన్‌ 810 200 7కోట్ల 13లక్షల 57వేలు

జంగారెడ్డిగూడెం 295 74 కోటి 18లక్షల 33వేలు

నూజివీడు 227 107 3కోట్ల 81లక్షల 86వేలు

చింతలపూడి 68 24 21లక్షల 15వేలు

7152 1070 36 కోట్ల60 లక్షల 62వేలు

Updated Date - Apr 23 , 2026 | 12:48 AM