అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:17 AM
వేసవి సమీపిస్తున్న తరుణంలో ప్రజలు అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని పత్తికొండ అగ్నిమాపక అధికారి దినకర్‌బాబు అన్నారు.
అగ్నిమాపక అధికారి దినకర్‌బాబు
పత్తికొండ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): వేసవి సమీపిస్తున్న తరుణంలో ప్రజలు అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని పత్తికొండ అగ్నిమాపక అధికారి దినకర్‌బాబు అన్నారు. గురువారం స్థానిక బాలురగురుకుల పాఠశాల ఆవరణంలో అగ్నిప్రమాదాలు, రక్షణచర్యలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు వాటిని ఎలా నివారించాలో ప్రదర్శనద్వారా విధ్యార్థులకు తెలియచేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, పైర్‌సిబ్బంది వెంకటేశ్వర్లు, షబ్బీర్, హుసేన, రంగస్వామి, లతీఫ్, అంజిలు ఉన్నారు.