బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:01 AM
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు శాసనసభలో చట్టం చేసి, పార్లమెంట్‌కు పంపించామని మంత్రి సవిత అన్నారు.
అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంట్‌కు పంపించాం
రాజమహేంద్రవరం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు శాసనసభలో చట్టం చేసి, పార్లమెంట్‌కు పంపించామని మంత్రి సవిత అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన దొమ్మేటి వెంకట రెడ్డి 173వ జయంతి సభలో ఆమె మాట్లాడారు. ‘బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా చేసుకోవడం శుభపరిణామం. నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు, యువనేత లోకేశ్ బీసీలను అక్కున చేర్చుకుంటున్నారు’ అని తెలిపారు.
విద్యార్థులను కింద పడుకోనీయకండి: మంత్రి సవిత
‘విద్యార్థులు కింద పడుకోవడం ఏంటి? బెడ్లు ఇవ్వండి అని మంత్రి సవిత ఆదేశించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలసి బీసీ హాస్టల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్ధులతో మాట్లాడి, సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకిచ్చే ఆహారం నాణ్యంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.