Share News

బీసీ కుటుంబాలను లెక్కించేలా చొరవ తీసుకోండి

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:41 AM

జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రులకు బీసీ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తం ప్రతిపాదికగా తీసుకోకుండా రాష్ట్రాన్ని యూనిట్‌గా...

బీసీ కుటుంబాలను లెక్కించేలా చొరవ తీసుకోండి

  • రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని కులగణన చేపట్టండి

  • కేంద్ర మంత్రులకు బీసీ సంఘం నేతల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, మార్చి 25(ఆంధ్రజ్యోతి): జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రులకు బీసీ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తం ప్రతిపాదికగా తీసుకోకుండా రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని కులగణన చేపట్టాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు, బీసీ జేఏసీ వర్కింగ్‌ చైర్మన్‌ గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బీసీ నేతలు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, కింజారపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో బుధవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. బీసీ డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. రెండు దఫాలుగా జరుగుతున్న జనగణనలో మొదటి విడత జరిగే కుటుంబాల లెక్కింపులో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలను లెక్కిస్తూ, బీసీ కుటుంబాలను మాత్రం లెక్కించడం లేదని కేంద్ర మంత్రుల దృష్టికి జాజుల తీసుకెళ్లారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభమయ్యే జనగణనలో కుటుంబాల లెక్కింపు కోసం 34వ కాలమ్‌గా ఓబీసీ కుటుంబాలను కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Mar 26 , 2026 | 03:41 AM