Share News

బీసీ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య: సవిత

ABN , Publish Date - May 13 , 2026 | 05:31 AM

రాష్ట్రంలో బీసీ సంక్షేమ విద్యాసంస్థలు నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలతో ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి ఎస్‌.సవిత అన్నారు.

బీసీ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య: సవిత

విజయవాడ అర్బన్‌, మే 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ సంక్షేమ విద్యాసంస్థలు నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలతో ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి ఎస్‌.సవిత అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఎంజేపీ గురుకులాలు, బీసీ వసతి గృహాల విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సవిత...టెన్త్‌లో 589 మార్కులు సాధించిన నెల్లూరుకు చెందిన ప్రణీతను సన్మానించారు. టెన్త్‌,ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన ఎంజేపీ గురుకులాలు, బీసీ హాస్టళ్ల విద్యార్థులకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. తన తండ్రి పేరిట ఏర్పాటుచేసిన ఎస్‌ఆర్‌ఆర్‌ ట్రస్ట్‌ ద్వారా స్కూల్‌ బ్యాగ్‌లు ఉచితంగా అందజేశారు.

Updated Date - May 13 , 2026 | 05:31 AM