బీసీ జనగణన తర్వాతే స్థానిక ఎన్నికలు.. హైకోర్టులో పిల్
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:59 AM
రాష్ట్రంలో బీసీ జనగణన జరిపిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు...
అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ జనగణన జరిపిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు దాఖలు చేసినపిల్ బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.ప్రణతి స్పందిస్తూ కౌంటర్ వేసేందుకు మరికొంత సమయమివ్వాలని అభ్యర్థించారు. అంగీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపించారు.