Share News

2028 నాటికి బసవతార కం క్యాన్సర్‌ ఆసుపత్రి మొదటి దశ పూర్తి

ABN , Publish Date - Jun 26 , 2026 | 05:46 AM

రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్మాణ పనులను హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం పరిశీలించారు.

2028 నాటికి బసవతార కం క్యాన్సర్‌ ఆసుపత్రి మొదటి దశ పూర్తి

తుళ్లూరు, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్మాణ పనులను హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం పరిశీలించారు. రాజధానిలో ఆయన సినిమా ప్రారంభోత్సవం అనంతరం హాస్పటల్‌ నిర్మాణ ప్రాంతానికి వద్దకు వెళ్లారు. కార్మికులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో పనుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అమరావతిలో అసుపత్రి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, 2028 నాటికి మొదటి దశ నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్టు తెలిపారు.

Updated Date - Jun 26 , 2026 | 05:47 AM